నా భర్త పెళ్లికి ముందే అలాంటి కండిషన్ పెట్టాడు... ఆమని కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటి ఆమని(Aamani).

ఈమె టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలలో నటించారు.

ఇలా ఆమని నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే ఆమని పెళ్లి(Marriage) చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇలా ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న తర్వాత ఆమని సినిమాలకు దూరంగా ఉండి కేవలం కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ తన వ్యక్తిగత జీవితంలో బిజీ అయ్యారు.

My Husband Put Such A Condition Before Marriage Aamani Details, Aamani, Aamani H

ఈ విధంగా కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే ఈమె ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానులు కూడా కాస్త ఫీలయ్యారు.అయితే తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్(Second Innings) ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ప్రస్తుత సినిమాలలో అమ్మ, అమ్మమ్మ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నటువంటి ఆమని బుల్లితెర సీరియల్స్, పలు కార్యక్రమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.

Advertisement
My Husband Put Such A Condition Before Marriage Aamani Details, Aamani, Aamani H

ప్రస్తుతం ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మొదటిసారి తన భర్త గురించి(Aamani Husband) ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

My Husband Put Such A Condition Before Marriage Aamani Details, Aamani, Aamani H

ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ తాను పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావడానికి కారణం తన భర్త పెట్టిన కండిషన్(Condition) అని తెలిపారు.తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లికి ముందే తన భర్త ఒక కండిషన్ పెట్టారట.పెళ్లి తర్వాత తాను సినిమాలలో నటించకూడదనే కండిషన్ పెట్టారని అందుకు తాను ఒప్పుకొని ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు.

అయితే ఇప్పుడు కనుక ఆలోచిస్తే అసలు నేనెలా ఈ కండిషన్ కి ఒప్పుకున్నానని నాకే సందేహం కలుగుతుందని ఆమని తెలిపారు.అయితే ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతోనే తిరిగి తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని ఈమె చెప్పుకొచ్చారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు