బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదు.. పవన్ కల్యాణ్

కాకినాడలో మైనారిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదని పవన్ తెలిపారు.

బీజేపీతో పొత్తులో ఉన్నానని ముస్లింలు తనను వదిలేస్తే మీరు నష్టపోతారంటూ పవన్ వ్యాఖ్యానించారు.తాను గుడ్డిగా బీజేపీకి వత్తాసు పలకనన్నారు.

జగన్ క్రిస్టియన్ కాబట్టి నమ్మవచ్చని ముస్లీంలు అనుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు.అయితే నిజంగా అల్లాను ప్రార్ధిస్తే సత్యం చెప్పే వాడు వారికి తప్పకుండా కనిపిస్తాడని తెలిపారు.

పాకిస్తాన్ లో చాలా వరకు హిందూవులను చంపేశారన్నారు.భారత్ లో 17 శాతం ముస్లింలు గౌరవంగా జీవిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Latest Latest News - Telugu News