శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివ కళ్యాణం సందర్భంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గౌరవ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు అధికారులు నాయకులతో కలిసి రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివ కళ్యాణానికి మున్సిపల్ పాలకవర్గ ఆధ్వర్యంలో గౌరవ కౌన్సిలర్లు అధికారుల నాయకులతో కలిసి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం జరిగిందని ఏ శైవ క్షేత్రంలోనైనా మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుందని కానీ మన వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్రంలో కామ దహనం హోలీ తర్వాత శివ కళ్యాణం ను ఘనంగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా పట్టణ ప్రజల సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని చేసే పనులలో విజయాలు కలగాలని ఆ స్వామి వారి ఆశీస్సులు కృపా కటాక్షం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్సర్ , గౌరవ పాలకవర్గ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,అధికారులు, నాయకులు,పట్టణ ప్రముఖులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News