సెప్టెంబర్ 17 పునర్ విముక్తి ప్రతిజ్ఞా దివాస్...!

బహుజన్ సమాజ్ పార్టీ( Bahujan Samaj Party ) నకిరేకల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ పునర్ విముక్తి ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని జాతీయ జెండాను అవిష్కరించి,తెలంగాణను కేసీఆర్ నియంత్రృత్వ పాలన నుండి విముక్తి చేయడానికి ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం మహనీయుడు పెరియార్ ఇవి రామస్వామినాయకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం( Telangana )లో సబ్బండ వర్గాల ఆశలు అడియాశలై, అణిచివేతకు గురయ్యారని అన్నారు.బంగారు తెలంగాణ పేరు చెబుతూ బాధల తెలంగాణ మిగిల్చారని తెలిపారు.

ఈతెలంగాణను దొరల నుండి విముక్తి చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెప్టెంబర్ 17ను తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకొని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం పాటుపడాలని ఆదేశించినట్టుగా చెప్పారు.తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజన జాతులన్నీ ఏకమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిని చేసుకొని బాధల తెలంగాణ నుండి బహుజన తెలంగాణను స్థాపించడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని,మార్పు దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్,రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్,చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల పాల్గొన్నారు.

Advertisement
పంద్రాఘస్ట్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

Latest Suryapet News