కాకినాడ రాజకీయాల్లోకి ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ..!?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సంకేతాలు కన్పిస్తున్నాయి.

ముద్రగడ మళ్లీ ఎంట్రీ ఇస్తారన్న చర్చ కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది.

తాజాగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.దాదాపు నాలుగేళ్ల తరువాత ముద్రగడ నూతన సంవత్సర వేడుకలను అభిమానులను ఆహ్వానించారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఈ నేపథ్యంలో ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే 2009 సంవత్సరం తరువాత ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ముద్రగడ నుంచి ఆహ్వానం రావడంతో అభిమానుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు