ఆ ఇమేజ్ కోసం మృణాల్ తాపత్రయం..!

అంతకుముందు కెరీర్ ఎలా ఉన్నా సీతారామం( Sitaramam ) తర్వాత మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) రేంజ్ మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ సినిమాతో హిందీలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది మృణాల్.

ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసినా సీతారామం తో సరికొత్త క్రేజ్ ఏర్పరచుకుంది.ప్రస్తుతం నాని 30వ సినిమాలో నటిస్తున్న మృణాల్ తన సినిమాల కన్నా ఫోటో షూట్స్ తో హంగామా సృష్టిస్తుంది.

సీతారామం లో తన పాత్ర చూసి ఆమెకు క్లాస్ ఇమేజ్ రాగా దాన్ని చెరిపేసి తనకు హాట్ ఇమేజ్ రావాలని ప్రయ్త్నిస్తుంది అమ్మడు.ఈ ప్రయత్నంలోనే ఆమె వరుస హాట్ ఫోటో షూట్ చేస్తూ వస్తుంది.మృణాల్ ఫోటో షూట్( Mrunal Photoshoot ) చూసి సీతారామం లో ఉంది ఆమేనే కాదా అన్న డౌట్ వస్తుంది.

లేటెస్ట్ గా కేన్స్ లో అమ్మడు తన డ్రెస్సింగ్ స్టైల్ తో వావ్ అనిపించింది.మరి అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ అన్నీ ఆమెకు ఎంత హెల్ప్ అవుతాయో చూడాలి.నాని తో చేస్తున్న సినిమా కూడా హిట్ అయితే మాత్రం మృణాల్ కి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

Advertisement

నాని సినిమా తర్వాత మరో సినిమా కూడా డిస్కషన్స్ లో ఉందని టాక్.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు