బి ఆర్ ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ను వీడని ఎంపీటీసీ కొత్త పెళ్లి పద్మ దేవయ్య

కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి చరిత్రలో నిలిచిపోయిన ఏకైక ఎంపీటీసీ పద్మ దేవయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా :బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ను వీడని ఎంపీటీసీ కొత్త పెళ్లి పద్మ దేవయ్య అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారము కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎంపీటీసీ సభ్యురాలు కొత్తపల్లి పద్మ దేవయ్య ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదవి కాలం పూర్తి అయినందున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి చరిత్రలో నిలిచిపోయిన ఏకైక ఎంపీటీసీ పద్మ దేవయ్య అని అన్నారు.బండ లింగంపల్లి గ్రామ ప్రజలకు ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎంపీటీసీ గా విశేష సేవలు అందించారన్నారు.

అధికార బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిన భయపడకుండా ఒత్తడి చేసిన ప్రలోభాలకు గురి కాకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ధర్నా రాస్తారోకోలు పోరాటాలు నినాదాలు చేయడంలో దేవన్న ముందుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేశారని ఆయన చేసిన సేవలకు పార్టీ పరంగా తగిన గుర్తింపు ఉంటుందన్నారు ఆయనను త్వరలో ఉన్నత పదవిలో చూస్తామన్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బండ లింగంపల్లి ఎంపీటీసీ కొత్తపల్లి పద్మా దేవయ్య ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని పట్టుకుని నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అందరిలాగా మారే వ్యక్తిని కాదు అని ఒక పట్టుదలతో ఉన్న వ్యక్తి దేవయ్య అని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఎంపీటీసీ కొత్తపెళ్లి పద్మ దేవయ్య మాట్లాడుతూ మాజీ మంత్రి సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్ ఏనాడు కూడా ఎంపీటీసీలను పట్టించుకోలేదని గ్రామాల అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఏనాడు కూడా మండల పరిషత్ మీటింగ్ కు రాలేదని కనీసం చివరిసారిగా ఎంపీపీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమానికి కూడా రాలేదన్నారు.బిఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది ఎంపీటీసీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎంపీటీసీగా గత ఐదు సంవత్సరాలుగా గ్రామాలలో తమ వంతు సహాయ సహకారాలు ప్రజలకు గుర్తుండిపోయేలా చేశామన్నారు.

Advertisement

ప్రజల సమస్యలు తెలుసుకుని వెనువెంటనే సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశామన్నారు.జిల్లాలో ఎక్కడి లేనివిధంగా ఎంపీపీ తోపాటు ఎంపీటీసీలతో కలిసి జెడ్పీటీసీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య , కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , పందిళ్ళ లింగం గౌడ్, చేపూరి రాజేశం గుప్తా , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు , బండారి బాల్ రెడ్డి, ఎడ్ల రాజ్ కుమార్ , కుంభాల మల్లారెడ్డి , నంది కిషన్ , సూడిది రాజేందర్, బానోతు రాజు నాయక్ , మద్దుల శ్రీపాల్ రెడ్డి , గుండాడి రామిరెడ్డి, రవి , రపిక్ , గంట బుచ్చ గౌడు , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, పందిళ్ళ సుధాకర్ గౌడ్ , బాలయ్య , మెగి నరసయ్య , ధర్మేందర్ ,ఎల్లా గౌడ్, దండు శ్రీనివాస్, ఇమామ్ , అంతేర్పుల గోపాల్ , మిరియల్కర్ చందు, రావుల ముత్యం రెడ్డి , మేడిపల్లి రవి , మాలోత్ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News