స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, స్పెషల్ ఆఫీసర్ తాహాసిల్దార్ రామచందర్

విద్యార్థులకు రాగి లడ్డుల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం గుంటపెల్లి చెరువు తండా, అల్మాస్పూర్ గ్రామపంచాయతీలలో పారిశుద్ధ కార్మికులతో స్పెషల్ డ్రైవ్( Special drive ) కార్యక్రమాన్ని బుధవారం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, స్పెషల్ ఆఫీసర్ తాహాసిల్దార్ రామచందర్ లాంచనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, అంగన్వాడీ కార్యకర్తలు , ఆశావర్కర్లతో గ్రామం మొత్తం స్పెషల్ ఆఫీసర్ తహశీల్దార్ రాంచందర్, ఎం పి పి పిల్లి రేణుక కిషన్ కలియ తిరిగి గ్రామ అవసరాలను గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆల్మాస్ పూర్ గ్రామంలో ఎంపిపి నిధులతో ఏర్పాటు చేసిన రెండు హైమస్ లైట్లను పిల్లి రేణుక కిషన్ , స్పెషల్ ఆఫీసర్ తాహాసిల్దార్ రామచందర్ ప్రారంభించారు.

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.అక్కడ పోషక అభియాన్ పథకంలో భాగంగా విద్యార్థులకు బాలింతలకు గర్భిణీలకు వారానికి ఒకసారి ప్రయోగాత్మాకంగా చేపట్టిన రాగి లడ్డూలను వారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ తహాసిల్దార్ రామచందర్( Ramachander ) మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో మన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రాబోయే వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా పగడ్బందీ కార్యచరణ అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News