కేవలం స్క్రీన్ ప్లే తో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలు ఇవే !

ఒక సినిమా టాక్ చాలా బాగుంది అని వస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి.

స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉండి ఉంటుంది అందుకే హిట్ టాక్ వచ్చింది అనుకుంటాం.

లేదంటే టేకింగ్ మహా అద్భుతంగా ఉండి ఉంటుంది దాంతో పాటు అదిరిపోయే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనే కదా ఊహిస్తాం.కానీ అతి సాధారణమైన సీన్స్ తో, ఎలాంటి కథ లేకుండా కేవలం స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండడంతో సినిమాకి మంచి టాక్ రావడం అంటే అది మామూలు విషయం కాదు గతంలో సత్యానంద్ మాస్టర్( Satyanand Master ) చాలా సార్లు చెప్పారు.

ప్రతి సినిమాకి స్క్రీన్ ప్లే మాత్రమే కింగ్ అని.ఏ సినిమా అయినా సరే డైలాగ్స్ లేకుండా తీయొచ్చు, పాటలు లేకపోయినా తీయొచ్చు కానీ స్క్రీన్ ప్లే లేకుండా ఆ సినిమాను తీయలేము అని చెప్పేవారు ఆయన.

Movies Which Are Hit Based On Screen Play Iratta Maharaja Gargi Details, Screen

మరి అలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చాలా రెగ్యులర్ కథ తో సూపర్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల విషయానికొస్తే ఈ మధ్యకాలంలో మహారాజ సినిమా( Maharaja Movie ) గురించి చెప్పుకోవచ్చు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి( Vijay Sethupati ) హీరోగా నటించగా చాలా నార్మల్ సీన్స్ అలాగే అసలు కథ రాసుకునేటప్పుడు చాలామంది డైరెక్టర్ ఇలాంటి సీన్స్ ని పట్టించుకోరు.అంతా పేలవమైన సీన్స్ ని సినిమాలో పెట్టి స్క్రీన్ ప్లే తో ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతం.

Advertisement
Movies Which Are Hit Based On Screen Play Iratta Maharaja Gargi Details, Screen

ఈ మధ్యకాలంలో చిన్న సీన్ బోర్ కొట్టిన చాలు ప్రేక్షకులు జేబులోంచి ఫోన్ తీసి చూస్తున్న రోజులు వాళ్ళు అలా ఒక్కసారి ప్రేక్షకుడు సినిమా నుంచి కనెక్ట్ అవ్వకుండా ఫోన్ లో తలపెడతాడు ఆ సినిమా ఫ్లాప్ అయినట్టే.

Movies Which Are Hit Based On Screen Play Iratta Maharaja Gargi Details, Screen

అలాగే సాయి పల్లవి నటించిన గార్గీ చిత్రం( Gargi Movie ) కూడా స్క్రీన్ ప్లే తోనే విజయవంతం అయింది.ఆ సినిమా కూడా చాలా రోజులపాటు జనాలను డిస్టర్బ్ చేస్తూనే ఉంది.అంత అద్భుతంగా ఎమోషనల్ గా సినిమాని తెరకెక్కించారు ఆశిత దర్శకుడు ఈ రెండు సినిమాలు కాకుండా మలయాళం లో ఆ మధ్య వచ్చిన ఇరట్టా సినిమా( Iratta Movie ) గురించి కూడా ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుకున్నారు.

సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం.అది జనాలను ఎంత బాగా కనెక్ట్ చేస్తే అంత బాగా ఆశ్రమం విజయం సాధిస్తుంది.అంత శక్తివంతమైన సినిమాలు కేవలం స్క్రీన్ ద్వారానే వస్తాయి ఆ సినిమాలే 50 రోజులు లేదా వంద రోజులు ఇలాంటి ఓటీటీ రోజుల్లో ఆడగలవు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు