దర్శకుడు అంటే కేవలం సినిమాను మాత్రమే తెరకెక్కిస్తాడు అనుకుంటే పొరపాటే.ఏ దర్శకుడికి సినిమాలోని 24 విభాగాలపై మంచి పట్టు ఉంటుంది.
అలా మంచి పట్టు దొరికినప్పుడే అందరితో బాగా పని చేయించుకుని మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించగలడు.వారు ఎలా అలా చేసిస్తే చాలు దాన్ని ఒక ఫ్రేమ్ లో పేరు చేసి విడుదల చేసి దర్శకుడు అయిపోదాం అనుకుంటే కుదరదు.
ప్రతి డిపార్ట్మెంట్ పై దర్శకుడికి మంచి నాలెడ్జ్ ఉండాలి.సంగీతం దర్శకుడు సూచించిన విధంగానే సంగీత దర్శకులు చేస్తారు వారికి సంగీతంపై కూడా పట్టు ఉంటేనే అద్భుతాలు దొరుకుతాయి అలా డైరెక్టర్ వంశీ( Director Vamsy ) అని చెప్పగానే చాలామందికి ఆయన సినిమాలు అలాగే ఆయన సినిమాలోని పాటలు మాత్రమే గుర్తొస్తాయి.
అంతలా మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా వంశీకి పేరు ఉంది.అయితే ఆయన ఎక్కువగా ఇళయరాజా తోనే( Ilayaraja ) కలిసి పనిచేశారు ఆయనతో కూర్చొని మంచి ట్యూన్స్ కట్టడం వంశికి ఎంతో ఇష్టం అందుకే ప్రతి సినిమాకి అద్భుతమైన పాటలను ఇస్తూ ఉంటారు వంశీ.అందులో సంగీత దర్శకుడి గొప్పతనం కన్నా కూడా వంశీ గొప్పతనమే ఎక్కువ.అయితే ఇలా సంగీతం పై పట్టు సాధించడంతో పాటు ఇళయరాజాతో కూర్చొని ట్యూన్స్ కట్టడం కూడా అలవాటు చేసుకున్నాడు వంశీ.
తాను దర్శకత్వం వహించిన మూడు నాలుగు సినిమాలకు తానే సంగీత దర్శకత్వం( Music Director ) కూడా చేసుకున్నాడు.
మామూలుగా వంశీ సినిమాల పేరు చెప్పగానే ఎవరు కాపీ కొట్టలేరు అని అనుకుంటారు.అలాగే ఆయన సంగీతం కూడా ఎవరు కాపీ చేయలేరు అంతలా గ్రిప్ ఉంటుంది వంశీకి.తన సొంత సినిమాలకు దర్శకత్వం చేసుకుంటూ సంగీత దర్శకత్వం చేశారు అంటే ఓ లెక్క కానీ వేరే డైరెక్టర్ చేసిన ఒక సినిమాకి కూడా వంశీ సంగీతం అందించారు.
ఆ సినిమా పేరు కన్నయ్య కిట్టయ్య.( Kannayya Kittayya ) రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వంశీ ఈ సంగీత దర్శకుడుగా పనిచేశారు రాజేంద్ర ప్రసాద్, శోభనా, ఆమని హీరో హీరోయిన్ గా పని చేశారు.
ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న సంగీత పరంగా మాత్రం మంచి మార్కులు పడ్డాయి వంశీకి.