వీడియో : అమ్మాయిని ఏడిపించాడని కన్న కొడుకుకు ఎలాంటి శిక్ష విధించిందో చూడండి

మొక్కై వంగనిది మానై వంగునా అంటారు పెద్దలు.అంటే మొక్కగా ఉన్న సమయంలోనే దాన్ని ఎటు కావాలి అంటే అటుగా ఆ చెట్టును వంచుకోవాలి.

అదే పెరిగి పెద్దగా అయిన తర్వాత దాన్ని ఏమీ చేయలేం.ఏదైనా మొదటి దశలోనే అంటే చిన్నప్పుడే దాన్ని మార్చేందుకు ప్రయత్నించాలి.

పెద్దది అయిన తర్వాత మార్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు.ఎన్నో రకాల చెడు అలవాట్లు ఉండే పిల్లలు ఉంటారు.

వారిని చిన్నతనంలోనే బాగు చేయాలి.లేదంటే వారు జీవితంలో నాశనం అవ్వడం ఖాయం.

Advertisement

అందుకే చైనాలోని ఒక తల్లి తన కన్న కొడుకుకు రోడ్డు మీద శిక్ష విధించింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

చైనాలోని ఒక ముఖ్య పట్టణంలో ఈ సంఘటన జరిగింది.ఒక స్కూల్‌ క్లాస్‌లో 7 సంవత్సరాల బాలుడు తన తోటి క్లాస్‌ అమ్మాయిని ఏడిపించాడట.

ఆ అమ్మాయిని పదే పదే ఏడిపిస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి మరియు ఆ అమ్మాయి తల్లి కలిసి ఆ బాలుడి తల్లికి ఫిర్యాదు చేయడం జరిగింది.ఆ అమ్మాయిని ఏడిపించిన విషయాన్ని ఆ బాలుడు ఒప్పుకున్నాడు.

తన కొడుకు ఇప్పుడే ఇలా ఉంటే పెద్ద వాడు అయిన తర్వాత ఎలా ఉంటాడో అనే భయం ఆమెలో కలిగిందో ఏమో, అందుకే చిన్నప్పుడే ఇతడిలోని చెడు ఆలోచనలను, చెడు ప్రవర్తనను పోగొట్టాలనే ఉద్దేశ్యంతో అతడికి కఠిన శిక్ష విధించింది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?

మనం స్కూల్‌లో గోడ కుర్చి వేసే ఉంటాం కదా, అదే ఆమె ఆ బాలుడికి రోడ్డు మీద వేయించింది.అది కూడా అతడి డ్రస్‌ విప్పి మరీ అలా చేసింది.డ్రస్‌ విప్పి అంతా చూస్తున్న సమయంలో రోడ్డు మీద గోడ కుర్చి ఆకారంలో కాళ్లు వంచి కింద కూర్చోకుండా కూర్చునేలా చేసింది.

Advertisement

అలా పది నిమిషాలు చేసింది.ఆ బాలుడు మరోసారి అలా చేయను, అల్లరి వేషాలు వేయను అంటూ చెప్పే వరకు ఆమె అలాగే కంటిన్యూ చేసింది.ఆమె చేసిన పనిని కొందరు సమర్ధిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

మరి ఆ తల్లి శిక్ష విషయంలో మీ స్పందన ఏంటో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

తాజా వార్తలు