వైరల్: తల్లీకూతుళ్లను కలిపిన సోషల్ మీడియా..!

పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఫేస్బుక్ ను వాడుతుంటారు.

ఫేస్బుక్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ వల్ల అనేక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి.ఫేస్బుక్ లోని సమాచారం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు, అలాగే నేరాలకు పాల్పడడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మరి ఇటువంటి ఫేస్బుక్ ద్వారా ఎంత నష్టం ఉందో అంతటి మంచి కూడా జరుగుతోంది.అందుకు ఈ ఘటనే సాక్ష్యం.6 సంవత్సరాల బాలిక తప్పిపోయింది.ఆమె 14 సంవత్సరాల తర్వాత తన తల్లిని కలుసుకుని ఆనందం వ్యక్తం చేసింది.ఇదంతా ఫేస్బుక్ వల్లనే జరిగింది.

టెక్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.అమెరికాలోని మెక్సికో సరిహద్దుల్లో తల్లీకూతుళ్ళు ఒకటయ్యారు.

Advertisement

తల్లిని చూడటానికి ఆ యువతి చేసిన కృషికి అందరూ అభినందనలు కురిపిస్తున్నారు.ఫ్లోరిడా క్లెర్మంట్‌ లోని ఇంటి నుంచి 6 ఏళ్ల జాక్వలైన్‌ హెర్నాండెజ్‌ కిడ్నాప్‌కు గురైన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఫ్లోరిడాలో పెరిగి పెద్దదైన ఆమె తన తల్లికి దూరంగా గడిపింది.తన తల్లి నుంచి దూరం అయిన తర్వాత తన బాధను కథలుగా ఫేస్బుక్‌ లో రాసేది.

జాక్వలైన్‌ మెసేజ్‌ చదివిన ఒకరి ద్వారా, ఆమె తల్లి టెక్సాస్‌ లో ఉన్నట్లు తెలుసుకుని సంతోషపడింది.

అలా ఆమె ఫేస్బుక్‌ పేజీకి నేరుగా మెసేజ్‌ పెట్టింది.పరుగున వెళ్లిన తల్లి ఏంజెలికా వెన్సెస్‌ సల్గాడో క్లెర్మాంట్‌ పోలీసులకు సమాచారం తెలిపింది.కొన్ని ఏళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన బాలికకు పోలీసులు సహాయం చేయాలని ఏంజెలికా వేడుకుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పలు డాక్యుమెంట్లను సిద్ధం చేసిన పోలీసులు జాక్వలైన్‌ హెర్నాండెజ్‌ చెప్పేది నిజమేనని ఒప్పుకున్నారు.ఆ తర్వాత తల్లిని కలుసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.ప్రస్తుతం తల్లీకూతుళ్లు కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు