డెంజర్‌ స్పాట్‌ : అక్కడకు వెళ్తే ప్రాణాలు పోతాయని తెల్సి కూడా వెళ్లి ఫొటోలు దిగుతున్నా

మనిషికి ప్రాణాల మీద చాలా ఆశ ఉంటుంది.

అయితే కొందరు సాహసం చేయాలని, ఎవరు చేయలేనిదాన్ని చేయాలని అందరిలో ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రత్యేకత కోసం ప్రాకులాడుతారు.

అలాంటి వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవ్వడం మనం చూస్తూనే ఉంటాం.ఇక ఆస్ట్రేలియాలోని ఒక ప్రాంతంకు వెళ్తే మనుషులు మళ్లీ వచ్చే అవకాశమే ఉండదు.

అక్కడకు పది కిలో మీటర్ల దూరంలోనే జనాలు ఉండి పోతారు.కాని కొందరు సాహసవంతులు మాత్రం అక్కడకు వెళ్లి మరీ ఫొటో దిగి వస్తున్నారు.

అసలు విషయం ఏంటీ అంటే ఆస్ట్రేలియాలోని విట్టెనూమ్‌లో అత్యంత ప్రమాదకరమైన అస్బెస్టాస్‌ ఖనిజాలు ఉన్నాయి.ప్రాణాలను తీసే ఆస్సెస్టాస్‌ వాయువు అక్కడ కోట్లు విలువ చేసేది ఉంది.కాని మనుషుల ప్రాణాలు తీస్తుండటంతో అక్కడకు వెళ్లేందుకు ఎవరు సాహసం చేయలేదు.

Advertisement

దాంతో దాదాపుగా 60 ఏళ్ల నుండి అక్కడ నుండి ఆ నిల్వలు అలాగే ఉంటున్నాయి.అయితే ఈమద్య విట్టెనూమ్‌ ప్రాంతం గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో అక్కడకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎవరు వెళ్లని చోటుకు తాము వెళ్లి వచ్చాం అని చెప్పుకునేందుకు, అక్కడ సెల్పీలు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారు.మాస్క్‌లు కట్టుకుని టూరిస్టులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు.దేశ విదేశాలకు చెందిన వారు అక్కడకు వెళ్తుండటంతో స్థాని అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వం దాన్ని నిషేదిత ప్రాంతంగా గుర్తించినా కూడా విదేశీయులు ఆ ప్రాంతంలో ఎక్కువగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న కారణంగా ఏం చేయలేని పరిస్థితి.ఏదైనా అవాంచనీయ సంఘటన జరిగితే తప్ప మళ్లీ అక్కడకు జనాలు వెళ్లకుండా ఉంటారని స్థానికులు అంటున్నారు.

అప్పట్లో ఆస్సెస్టాస్‌ ను తవ్వుతున్న క్రమంలో దాదాపు 30 మంది చనిపోయారు.దాంతో వెంటనే ఆ క్వౌరీని మూసేయడంతో పాటు చుట్టు 10 గ్రామాలను అక్కడ నుండి తరలించారు.దాదాపు 50 ఏళ్ల పాటు అటువైపు ఎవరు చూడలేదు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

మళ్లీ ఇప్పుడు మాస్క్‌లు వేసుకుని అటు వెళ్తున్నారు.అక్కడ అద్బుతమైన లొకేషన్స్‌ మనసుకు అహ్లదాన్ని కలిగిస్తాయి.

Advertisement

తాజా వార్తలు