ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఈసీ.. !

ఎన్నికలు అనగానే అవకాశవాదులకు పండగలా ఉంటుంది.ఏంచక్కా తాగడానికి మందు, చేతి ఖర్చులకు డబ్బులు ఇంకేం కావాలి.

ఇలా ఎన్నికలకని అడ్దగోలుగా ఖర్చుపెడుతున్న నేతలను అడ్డుకునే వారు లేరు.ప్రజధనాన్ని నీళ్లలా ధారపోస్తూ తిరిగి జనాన్ని పీడీంచే రాజకీయాలు ప్రస్తుతం సమాజంలో చేస్తున్నారు.

Mlc Elections In Telugu States Cec Postponed, AP, Telangana, MLC Elections, CEC

దీనికి తోడు కరోనా అనే మహమ్మారి జలగలా ప్రజలను పీడిస్తున్న నేపధ్యంలో ఇదివరకే ఎన్నికలకు పోయిన రెండు రాష్ట్రాల నేతలు కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అయ్యారు.అందుకే ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

పలుచోట్ల ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కోసం నిర్వహించవలసిన ఎన్నికలను ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది.ఇకపోతే ఈ నెల 31తో ఏపీలో 3 స్థానాలకు, జూన్ 3తో తెలంగాణలోని 6 శాసన మండలి స్థానాలకు గడువు ముగియనుంది.

Advertisement

అందులో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుందట.మొత్తానికి ఈ ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలుపుతున్నారు.

ఈ రాగి డ్రింక్ తో నీరసానికి చెప్పండి బై బై..!
Advertisement

తాజా వార్తలు