మిర్యాలగూడ సీటు నాకే...సీపీఎంకు పోదు: ఎమ్మెల్యే భాస్కర్ రావు

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నుంచి నేనే పోటీ చేస్తానని,కారు గుర్తు, గులాబీ జెండానే ఉంటదని ఈ సీటు సీపీఎంకు పోతుందన్న అపోహలు వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పష్టం చేశారు.

ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ లో జరిగిన వేములపల్లి మండల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు చేపట్టామని,ఇంకా అవసరమైతే రూ.60 కోట్లు తెస్తానని చెప్పారు.సీఎం కేసీఆర్ ను ఓడించే శక్తి ఏ పార్టీకి లేదన్నారు.

పంటలకు సాగునీరు అందించడం,ఐకేపీ సెంటర్ల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.ఏమి పని చేయకుండా నాలుగు చీరలు పంచె కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు.మనం వేసిన రోడ్లపై వేరే పార్టీలకు ఓటేసే వారు ఎందుకు నడుస్తున్నారో అడగాలని పార్టీ నాయకులకు సూచించారు.31 వేల ఓట్ల మెజార్టీతో మిర్యాలగూడ నియోజకవర్గంలో గెలిచామని,సీటును ఎవరు వదులుకోరనిఅన్నారు.ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై మరియు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి.

ఇప్పుడు అవి నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.ఇదే సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

Latest Nalgonda News