బాలిక ప్రాణం తీసిన భయం.. ఇంతకు ఏం జరిగిందంటే.. ?

ఈ మధ్యకాలంలో ప్రాణం తీసుకోవడానికి సరైన కారణం అవసరం లేదనేలా పరిస్దితులు మారిపోయాయి.చిన్న మాటకు కూడా జీవితాన్ని చీకటి మయం చేసుకుంటున్నారు.

తమ ఊపిరిని అర్ధాంతరంగా ఆపేసుకుంటూ కన్న వారికి కడుపుకోత పెడుతున్నారు యువత.ఇలాంటి సంఘటనే మియాపూర్ లో చోటుచేసుకుంది.

Hyderabad, Miyapur, Girl, Suicide-బాలిక ప్రాణం తీస�

దీనికి కారణం భయం.ఇక జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే.మియాపూర్‌ న్యూ కాలనీలో అనిల్‌, సంగీత దంపతులు నివాసముంటున్నారట.

వీరు కూతురు అనిత(14)తో కలిసి ఉంటున్నారు.కాగా అనిల్‌ కూలీ పని చేసుకుంటుండగా, సంగీత చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారట.

Advertisement

ఇక 6వ తరగతి చదువుతున్న అనిత నిన్న సాయంత్రం తన స్నేహితుడి ఫోన్‌లో గేం ఆడుకుంటుండగా అది కాస్త చేతిలో నుండి జారి కిందపడి పగిలిపోయిందట.ఈ విషయంలో అనితకు ఆమె స్నేహితుడికి మధ్య గొడవ జరిగింది.

కాగా అతను ఈ విషయాన్ని అనిత తల్లికి చెప్పుతా అని అనడంతో భయపడిపోయిన అనిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య కు ప్రయత్నించిందట అదే సమయంలో ఇంటికి వచ్చిన తల్లి వెంటనే స్దానికుల సహాయంతో సమీపంలోని హస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు