మీ షాంపూలో ఇవి క‌లిపి హెడ్ బాత్ చేస్తే చుండ్రు ఇట్టే పోతుంది!

చుండ్రు. ఒక్క‌సారి ప‌ట్టుకుందంటే అంత సుల‌భంగా పోదు.

పైగా చుండ్రు వ‌ల్ల త‌ల దుర‌ద‌, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్యలు తీవ్రంగా పెరిగి పోతాయి.

అందుకే చుండ్రును వ‌దిలించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ పాటిస్తారు.కొంద‌రు చుండ్రును నివారించుకునేందుకు వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ట్రీట్‌మెంట్ కూడా చేయించుకుంటారు.

కానీ, మీ రెగ్యుల‌ర్ షాంపూలో ఇప్పుడు చెప్ప‌బోయే పాదార్థాలు క‌లిపి త‌ల స్నానం చేస్తే స‌హజంగానే చుండ్రు పోతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్ వేసి బాగా మ‌రిగించాలి.ఆ వెంట‌నే స్ట‌వ్ ఆఫ్ చేసి కాఫీ డికాక్షన్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని పీల్ తొల‌గించి స‌న్న‌గా త‌రుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

మ‌రోవైపు ఒక క‌ప్పు వాట‌ర్‌లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసి రెండు గంటల పాటు నాన‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో మీ రెగ్యుల‌ర్ షాంపూ మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.

ఆపై రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ జ్యూస్‌, నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ డికాక్ష‌న్‌, రెండు టేబుల్ స్పూన్ల రైస్ వాట‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్ సీడ్ జెల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని యూజ్ చేసి త‌ల స్నానం చేయాలి.ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తే గ‌నుక‌.

చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అలాగే షాంపూలో పైన చెప్పిన ప‌దార్థాలు క‌లిపి హెడ్ బాత్ చేస్తే.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

జుట్టు న‌ల్ల‌గా, షైనీగా కూడా మారుతుంది.

తాజా వార్తలు