వైసీపీ జాతీయ అధ్యక్షుడిగా జగన్ ? ఏపీ అధ్యక్షుడిగా ఆ యువ ఎంపీ ?

వైసీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోయలేని భారం తలెకెత్తుకున్నారు.జగన్ అధికారంలోకి వచ్చేసరికి ఏపీలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

ఆదాయం లేదు.మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి.

చంద్రబాబు  ముఖ్యమంత్రి పీఠం దిగి జగన్ కు అప్పగించే సరికే ఏపీ పూర్తిగా అప్పుల్లోనే మునిగితేలిపోయింది.ఖజానాలో సొమ్ములు లేవు.

అయినా జగన్ ఏపీపై వరాల జల్లు కురిపించి జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు.కానీ రోజులు గడిచేకొద్దీ మరెన్నో సమస్యలు జగన్ ను చుట్టుముడుతున్నాయి.

Advertisement

ప్రభుత్వాన్ని నడపడం ఇబ్బందికరంగా మారింది.ఇదే అనుకుంటే, ఈ సమయంలోనే పార్టీ నాయకుల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.

ఎక్కడ చూసినా పార్టీ నేతల మధ్య విభేదాలే కనిపిస్తున్నాయి.మరికొన్ని చోట్ల అవినీతి వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి.

నాయకుల వ్యవహార శైలి కారణంగా పార్టీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలంటే అది కుదరని పని అనే అభిప్రాయానికి వచ్చిన జగన్ చంద్రబాబు మాదిరిగానే ఏపీ, తెలంగాణలో పార్టీ అధ్యక్షులను నియమించి జాతీయ అధ్యక్షుడిగా తాను ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కాస్తోకూస్తో నాయకులు ఉండడంతో, వారందరినీ మళ్ళీ యాక్టివ్ చేసి, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి, వారిలో ఒకరిని తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా నియమించాలని, అలాగే ఏపీలోనూ తనకు అత్యంత సన్నిహితుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ని ఏపీ వైసీపీ అధ్యక్షుడిగా నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.మిథున్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్నారు.అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉండడంతో పాటు తనకు అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో మిథున్ రెడ్డి అయితేనే అన్ని వ్యవహారాలను చక్కపెట్టగలరు అనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

ఈ మేరకు మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టి, తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలి అని, అలాగే మిథున్ రెడ్డి ద్వారా పార్టీని గాడిలో పెట్టి నాయకుల్లో ఉత్సాహం పెంచాలని జగన్ అభిప్రాయపడుతున్నారట.తెలంగాణలో రాష్ట్ర కమిటీ నియామకం పూర్తయిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, వైసీపీ అధ్యక్షులను నియమించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు