మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ - యాప్ ద్వారా గుర్తించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు నవీన్ కు చెందిన సెల్ ఫోను నిన్నటి రోజు ఎక్కడో పడిపోగా వెంటనే ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఎస్సై శేఖర్ వెంటనే స్పందించి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ యాప్ లో ఐ ఎం ఈ ఐ నెంబర్ ను అప్లోడ్ చేసి సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి అతని నుంచి సెల్ ఫోన్ రికవరీ చేసుకొని బాధితుడు రేసు నవీన్ కు శుక్రవారం ఇచ్చారు.

ఎవరైనా సెల్ ఫోన్ పోయిన వెంబడే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసి వారి సెల్ ఫోన్ ను గుర్తించి ఇవ్వడం జరుగుతుందన్నారు.

మీకు మీరుగా ఈ యాప్ ద్వారా సెల్ ఫోను గుర్తించే అవకాశం కూడా ఉందని సూచించారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News