స్టార్ హీరోయిన్ అనుష్కకు అలాంటి చెడ్డ అలవాటుందా.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

స్టార్ హీరోయిన్ అనుష్క( Star Heroine Anushka ) వచ్చే నెల 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో అనుష్క కొన్ని షాట్స్ లో క్యూట్ గా, కొన్ని షాట్స్ లో బొద్దుగా కనిపించారు.

ఈ సినిమా ట్రైలర్ రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో అనుష్కకు మరో సక్సెస్ అయితే దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జాతిరత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగగా ఈ సినిమాతో మార్కెట్ మరింత పెరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే స్టార్ హీరోయిన్ అనుష్కకు సంబంధించి ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనుష్కకు గోర్లు కొరికే అలవాటు( Biting Nails ) ఉందని వైరల్ అవుతున్న ఆ వార్త సారాంశం.

చిన్నప్పటి నుంచి అనుష్కకు ఈ అలవాటు ఉందట.ఈ అలవాటును మార్చుకోవాలని అనుష్క చాలా ప్రయత్నించారని అయితే ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికీ కూడా అనుష్క చాలా సందర్భాల్లో తనకు తెలియకుండానే గోర్లు కొరికేస్తారట.ఆ అలవాటును మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఈ బ్యూటీ చెబుతున్నారట.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) తప్ప అనుష్క చేతిలో మరే ప్రాజెక్ట్ లేదనే సంగతి తెలిసిందే.

అనుష్క కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదో లేక కొత్త ఆఫర్లు ఆమెకు రావడం లేదో తెలియడం లేదు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు అనుష్క 6 కోట్ల రూపాయల పారితోషికం( Anushka Remuneration ) తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనుష్కను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ కు ప్రముఖ సెలబ్రిటీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు