జలుబు మాయం కావాలంటే పుదీనా ఆవిరి....పుదీనాతో మరిన్ని ఉపయోగాలు

వానలు ప్రారంభం అయ్యాయి.ఈ వానలతో పాటు దగ్గు, జలుబు వంటివి కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి.

మందులను ఉపయోగించకుండా మనకు అందుబాటులో ఉండే పుదీనా తో సులభంగా తగ్గించుకోవచ్చు.పుదీనా దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గించటమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది.

పుదీనా ఉపయోగాలను తెలుసుకుంటే మీరు పుదీనాను ప్రతి రోజు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటారు.జలుబు,దగ్గుతో బాధపడుతున్నప్పుడు మరిగే నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టాలి.

ఆవిరి పట్టినప్పుడు నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి.ఈ విధంగా ఆవిరి పట్టటం వలన గొంతు,ముక్కు,నోరు శుభ్రపడి ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది.

Advertisement

పుదీనా ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.పుదీనాను ప్రతి రోజు ఎదో రూపంలో తీసుకోవటం మంచిది.

నెలసరి సమయంలో వచ్చే నొప్పులను పుదీనా చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ రకరకాల అలర్జీలనూ, ఆస్తమానూ తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

పుదీనాలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన దంత క్షయాన్ని నివారించటమే కాకుండా దంతాలూ, నాలుకనూ శుభ్రం చేసి నోటి దుర్వాసనను పోగొడటంలో సహాయపడుతుంది.

ప్రతి రోజు నాలుగు పుదీనా ఆకులను నమలటం వలన దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.పుదీనా తరచుగా తీసుకోవటం అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.భోజనం తర్వాత ఒక కప్పు పుదీనా టీ త్రాగితే జీర్ణక్రియ బాగుంటుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

పుదీనా ఆకులలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సి, డి, ఇ-లతోపాటు తక్కువ మొత్తంలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి సహాయపడుతుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుదీనాను క్రమం తప్పకుండ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు .

Advertisement

తాజా వార్తలు