పారిశుధ్య కార్మికులతో మంత్రి సబితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి సహపంక్తి భోజనం..

పారిశుధ్య కార్మికులతో మంత్రి సబితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి సహపంక్తి భోజనం.

మహేస్వరం జల్ పల్లి మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు,నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి.

స్వచ్ఛ జల్ పల్లి కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు.బుధవారం నాడు జలపల్లి స్వచ్ఛ సిబ్బందికి పలు రకాల వస్తువులతో కూడిన శానిటేషన్ కిట్ లను అందించారు.

Minister Sabitha Indra Reddy And Mp Ranjith Reddy Social Gathering With Jal Pall

అనంతరం వారితో కలసి భోజనం చేసారు.మంత్రి సబితా రెడ్డి వారికి స్వయంగా భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కాలంలో అందరూ ఇంటికే పరిమితం అయిన ప్రజల కోసం బయటకు వచ్చి సేవలు అందించింది పారిశుధ్య కార్మికులు మాత్రమే అని అన్నారు.ప్రభుత్వం వీరికి అండగా ఉంటుందని మంత్రి అన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో చైర్మన్ సాధి గారు, వైస్ ఛైర్మన్ ఫర్హా నాజ్ గారు, కమిషనర్ జి పి కుమార్ పాల్గొన్నారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement
" autoplay>

తాజా వార్తలు