రవాణా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

పలు అంశాలపై చర్చ.సేవలను మరింత విస్తృతం చేయాలని ఆదేశం.

రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్ప గుచ్చా లతో అభినందనలు తెలిపిన అధికారులు.

ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో రవాణా శాఖ మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Puvwada Review With Transport Officials , Minister Puvwada Review , Tr

సోమవారం ఉదయం అధికారులతో సమావేశమైన మంత్రి పువ్వాడ పలు శాఖాపరమైన అంశాలపై చర్చించారు.రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్లైన్ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సేవలను మరింత విస్తృతం చెయ్యాలని, మరి కొన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలని అదేశించారు.ఆర్టీసీలో ప్రస్తుత బస్సులతో పాటు EV బస్సులు, దినసరి ఆదాయం తదితర అంశాలపై చర్చించారు.

Advertisement

రవాణా శాఖ మంత్రి గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, ఇతర ఉన్నతాధికారులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు