అంతా నేనే అంటున్న వైసీపీ మంత్రి ? ఎవరినీ లెక్కచేయడం లేదా ?

ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా వేసుకుని ఎక్కడా విమర్శలకు తావులేకుండా మంత్రివర్గాన్ని కూర్పు చేశారు.

ఆ లెక్కల తో పాటు తనకు అత్యంత సన్నిహితులైన కొంతమంది వ్యక్తులు కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రాధాన్యం కల్పించారు.

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అప్పుడు, ఇప్పుడు జగన్ మాటే ఫైనల్.ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వైసీపీలో ఉంది.

ఎవరైనా ఈ విషయంలో క్రమశిక్షణ తప్పితే వారి మీద వేటు వేసేందుకు జగన్ వెనకాడరు.అయితే జగన్ కు అత్యంత సన్నిహితులైన కొంతమంది మాత్రం ఈ రూల్స్ ఏవీ తమకు వర్తించవు అన్నట్టుగా వ్యవహిరిస్తున్నారట.

ప్రస్తుతం ప్రభుత్వంలో చూసుకుంటే ఎవరికి వారే తాము గొప్ప అంటే తాము గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఒకరి నియోజకవర్గాలు మరొకరు వేలుపెడుతూ వివాదాస్పదంగా మారుతున్నారు.

Advertisement
Minister Peddi Reddy Ramachandra Reddy-అంతా నేనే అంటు�

ఇప్పటికే కొంత మంది ఈ విషయంలో మితిమీరిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ ఇతర నియోజకవర్గాల్లో ఎవరూ వేలుపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు.ఇక చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చాలా చురుగ్గా ఉంటున్నారు.

ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీ గా ఉన్నారు.వైసీపీ తరఫున ఢిల్లీలో బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.

Minister Peddi Reddy Ramachandra Reddy

ఇద్దరికీ జగన్ ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.అయితే ఈ శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలైనవన్నీ ఈ శాఖ ద్వారా జరుగుతాయి.

ఇటువంటి కీలకమైన శాఖ నిర్వహిస్తున్న రామచంద్రారెడ్డి ఉపాధి పనులను తమకు కావలసిన వారికి మాత్రమే ఇప్పిస్తూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.గత ప్రభుత్వంలో చేసిన పనులు, నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
ఈ పొడిని రోజుకు అర టీ స్పూన్ తీసుకుంటే బాన పొట్టకు బై బై చెప్పచ్చు!

ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిధులు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసినా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.జగన్ కు అత్యంత సన్నిహితుడు అనే అహంభావంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చలు నడుస్తున్నాయి.

Advertisement

అయితే ఈ విషయంలో జగన్ కల్పించుకుని ఆయన్ను కట్టడి చేయకపోతే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం తప్పదని ఆ పార్టీ నాయకులు కొంతమంది హెచ్చరిస్తున్నారు.

Separate tags with commas

తాజా వార్తలు