తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కళ్లు తెరచుకుంటుంది కావచ్చూ అని అనుకుంటున్నారట నెటిజన్స్.ఎందుకంటే నిన్న కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూల్ చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వడం ఎన్నడు లేని వింతగా జనం చెప్పుకొంటున్నారట.
ఇక కరోనా మనదేశానికి వచ్చి మొదటి సంవత్సరం విజయవంతగా ముగించుకుని, సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ ఫుల్‌గా ఆడిన ఇన్నాళ్లకు ప్రభుత్వం స్పందిస్తూ బుడిబుడి అడుగులు వేస్తున్నట్లుగా ప్రవర్తించడం కొందరిని ఆశ్చర్యానికి లోను చేస్తుందట.ఎందుకంటే ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంచడమే ఈ ఆశ్చర్యానికి కారణం.

ఈ సంధర్భంగా కరోనా పాజిటివ్ వస్తే ఇకపై హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లే అవసరం లేదని మంత్రి కేటీఆర్ అనడం మరోక వింత అంటున్నారట జనం.ఇక ఎప్పుడు బట్టిపట్టినట్లుగా చెప్పే పాత డైలాగ్ తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుతోందని, మళ్లీ కోవిడ్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనడం విడ్డూరం.ఇక ఇలాంటి ముచ్చట్లు కరోనా వచ్చినప్పటి నుండి చెబుతున్నారు.కానీ కోవిడ్ తెలంగాణ ప్రజలను కోలుకోకుండా చేసింది.మరి ఇందుకు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో లెక్కలు చెబితే బాగుంటుందని నెటిజన్స్ అనుకుంటున్నారట.