ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్..!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లై ఓవర్ ను సోమవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు బైరామల్‎గూడ జంక్షన్‎లో ఫ్లై ఓవర్‎ను నిర్మించారు.

ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.బైరామల్‎గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‎ను ఎస్ఆర్‎డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా 784 మీటర్ల పొడవు బ్రిడ్జిని రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఎస్ఆర్‎డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ.448 కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన 14 పనులలో ఇప్పటికే ఆరు పూర్తి కాగా, మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్బీనగర్ జంక్షన్‎లో నిర్మించిన అండర్ పాస్, బైరామల్‎గూడ, నాగోలు కామినేని చౌరస్తా, చింతల్ కుంట అండర్ పాస్‎లు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.కాగా, బైరామల్‎గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు.ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొదటిసారి స్లాబ్స్, క్రాష్ బారియర్స్, ఫిక్షన్ స్లాబుల నిర్మాణంలో ఆర్‎సీసీ ఫ్రీకాస్ట్ టెక్నాలజీని వినియోగించారు.

ఇక ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బైరామల్ గూడ జంక్షన్, సాగర్ రోడ్ జంక్షన్‎లలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Advertisement
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు