మంత్రి జగదీష్ రెడ్డి జోక్యంతో తీరిన రైతుల కష్టాలు...!

సూర్యాపేట జిల్లా:రైతుల కష్టాలు రైతులకే తెలుసు అంటారు.

రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి స్వతహాగా వ్యవసాయాన్ని ఇష్టపడే సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కష్టకాలంలో తోటి రైతులకు ఆసారాగా నిలిచి,వారి కళ్ళలో ఆనందం నింపారు.

మంత్రి చొరవతో ఎండిపోతున్న వందల ఎకరాల పంట పొలాలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి.మూసీ ప్రధాన కాలువ సింగిరెడ్డి పాలెం -తాళ్ళ ఖమ్మం పహడ్ గ్రామ రైతుల భూములకు వెళ్లే 36వ డిస్ట్రిబ్యూటరీకి సంబంధించిన కాలువకు అనుసంధానంగా మరో మైనర్ కాలువ ఉంది.

Minister Jagdish Reddy's Intervention Solved The Problems Of Farmers. , Farmers

అయితే కొంత కాలం క్రిందట పంచాయితీ రాజ్ శాఖ అధ్వర్యంలో కాలువపై రహదారిని నిర్మించే సమయంలో కాలువ గూనల లెవెల్ ను గుత్తేదారులు సరి చూస్కొలేదు.దీంతో కాలువకు నీరు ఎక్కక పోవడంతో సింగిరెడ్డిపాలెం,తాళ్ళ ఖమ్మం పహాడ్ గ్రామాల రైతులకు చెందిన వందలాది ఎకరాలు ఎండిపోయే పరిస్తితి దాపురించింది.

రైతులు వాట్సప్ లో తమ సమస్యను రెండు రోజల క్రితం మంత్రి జగదీష్ రెడ్డి పోస్ట్ చేశారు.వెంటనే స్పందించిన మంత్రి పంచాయితీ రాజ్, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,24 గంటల్లో మూసీ కాలువను పునరుద్ధరించి నీటిని పోయే విధంగా మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.

Advertisement

మంత్రి ఆదేశాలతో కదిలిన ఇరిగేషన్,పంచాయితీ రాజ్ విభాగము అధికారులు 24 గంటల లోపు కాలువను తవ్వి నీరు వెళ్ళే విధంగా కాలువను పునరుద్ధరించారు.దీంతో మరో రెండు రోజుల్లో ఎండి పోయే స్థితిలోకి వెళ్లిన పంటలు ప్రాణం పోసుకావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఫోన్ లో సమస్యను పంపితే వెంటనే స్పందించి వందలాది మంది రైతు ఇళ్లలో ఆనందం నింపిన మంత్రికి జీవితాంతం అండగా ఉంటామని తెలిపారు.

Advertisement

Latest Suryapet News