పవన్ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం, మంత్రులను తిట్టడానికి పవన్ సభ పెట్టారన్నారు.

జనసేన పేరును చంద్రసేనగా మారిస్తే సరిపోతుందని విమర్శించారు.పవన్ స్పీచ్ ఆంబోతు రంకెలు వేసినట్లుందన్న ఆయన జనసేనకు ఓ విధానం అంటూ ఏదీ లేదని తెలిపారు.

పవన్ అన్న చిరంజీవి సినిమాల్లోకి రాకముందే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని పేర్కొన్నారు.ప్యాకేజీ తీసుకోలేదని మీ అన్నయ్యపై ఒట్టు వేసి చెప్పగలవా.? అని ప్రశ్నించారు.పవన్ ప్యాకేజీ స్టారేనన్న మంత్రి గుడివాడ పవన్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో విలనేనని వెల్లడించారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు