విజయనగరం: రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్… ఎన్ సి ఎస్ షుగర్స్ ఇవ్వాల్సిన బకాయిల కోసం రైతుల రాస్తారోకో చేయటం తప్పుకాదు.ఎం సి ఎస్ షుగర్స్ ప్రవేట్ యాజమాన్యం కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముందే హెచ్చరించాం.
ఇప్పటికే పది కోట్ల చక్కెర సీజ్ చేశాం.ఫ్యాక్టరీ కి సంభందించిన ఆస్తులు జప్తు చేసి వాటి ద్వారా వచ్చే సొమ్ము రైతులకు అందజేస్తాం.
ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రభుత్వం.ఎప్పుడూ లేని సంస్కృతి ఇప్పుడు తీసుకువస్తున్నారు.
గతంలో ఎప్పుడూ రాళ్లతో దాడి చేసిన ఘటనలు జిల్లాలో లేవు.వామపక్షాలు, టిడిపి ప్రోత్సాహంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.రైతుల పై లాఠీఛార్జ్ జరగలేదు, లాఠీఛార్జ్ పేరుతో రైతులను రెచ్చకొట్టొద్దు.
రాజధాని రైతులు పాదయాత్ర అంటే టిడిపి కార్యకర్తల పాదయాత్ర.
టిడిపి వాళ్ళు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారు.
టిడిపి రాష్ట్ర వినాశనం కి పాల్పడుతుంది.రాష్ట్ర డిజిపి పై చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
చంద్రబాబు చేతకాని మాటలు మాట్లాడుతున్నారు.నామినేషన్స్ ప్రశాంతంగా సాగుతున్నాయి.
ప్రవేట్ యాజమాన్యాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.