జనసేనాని పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.పొత్తు ధర్మమే కాదు.

ఏ ధర్మం పాటించని వ్యక్తి చంద్రబాబు( Chandrababu ) అని విమర్శించారు.

ఇకనైనా తెలుసుకో తమ్ముడు పవన్ అంటూ మంత్రి అంబటి( Ambati Rambabu ) ట్విట్టర్ వేదికగా సూచించారు.అయితే రా కదలి రా కార్యక్రమంలో భాగంగా మండపేట టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.దీనిపై పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు.

పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరించిందన్న ఆయన చంద్రబాబు తరహాలోనే తనపై కూడా ఒత్తిడి ఉందని తెలిపారు.ఈ క్రమంలోనే తాను కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నానన్న పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరం జనసేన అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు