బీట్ రూట్ పంట సాగు చేసే విధానం.. సస్య సంరక్షక పద్ధతులు..!

వ్యవసాయంలో ఇక దిగుబడి కోసం వివిధ రకాల రసాయన ఎరువులు అధికంగా ఉపయోగిస్తూ ఉండడంతో ఆహార పంటలలో నాణ్యత లోపిస్తుంది.

సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.

కాబట్టి సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.అధిక పోషకాలు ఉండే కూరగాయలలో బీట్రూట్ ప్రధానం అని చెప్పవచ్చు.

రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్( Beetroot ) ఔషధంగా పనిచేస్తుంది.అందువల్ల బీట్రూట్ సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చు.

బీట్రూట్ పంట సాగు చేసే విధానం లో పాటించాల్సిన సస్య రక్షక పద్ధతులు ఏమిటో చూద్దాం.

Advertisement

బీట్ రూట్ సాగు చేయడానికి సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి.ఈ పంట మూడు నెలలకు కోతకు వస్తుంది.భూమి యొక్క pH విలువ 6 నుంచి 7 వరకు ఉండే నేలలలో అధిక దిగుబడి పొందవచ్చు.

చల్లటి వాతావరణం( cold weather ) ఈ పంటకు అనుకూలం.భూమిలో అధికంగా క్షార స్వభావం కలిగిన చౌడు నేలలు కూడా ఈ పంట సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఉష్ణోగ్రత 18 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండే వాతావరణంలో ఈ పంటను సాగు చేయాలి.

వేసవి కాలంలో బాగా లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆఖరి దిక్కులో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువులు వేసి కలియదున్నాలి.నేల యొక్క స్వభావాన్ని బట్టి 12 కిలోల నత్రజని,12 కిలోల పొటాష్, 40 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను పొలంలో చల్లుకోవాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు 

ఆ తర్వాత పొలంలో ఏవైనా పంట అవశేషాలు ఉంటే పూర్తిగా తొలగించాలి.ఇక మొక్కల మధ్య 8 సెంటీమీటర్లు, వరుసల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి.

Advertisement

ఒక ఎకరం పొలంలో దాదాపుగా నాలుగు కిలోల విత్తనాలు విత్తుకోవాలి.విత్తిన 25 రోజులకు 10 కిలోల నత్రజని, పది కిలోల పొటాష్ ఎరువులను కలుపు తీసిన తర్వాత చల్లుకోవాలి.

తెగుళ్లు రాకుండా ముందుగానే విత్తన శుద్ధి చేసుకోవాలి.నేల ఎక్కువ స్వభావాన్ని బట్టి నీటి తడులను అందిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.

తాజా వార్తలు