కరోనా వల్ల మానవత్వం మంట కలిసింది.... పాపం వ్యక్తి రోడ్డు పైనే...

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎంత దయనీయ పరిస్థితుల్లో మనం  బ్రతుకుతున్నామో బాగా అర్థమవుతుంది.

తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై గుండెపోటుతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రోడ్డుపై అతన్ని గమనించి నటువంటి జనాలు చోద్యం చూస్తూ నిలబడ్డారు తప్ప ఒక్కరు కూడా సాయం చేయలేదు.

దీంతో కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో వెంకటేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ స్టిల్ దుకాణంలో పని చేస్తున్నాడు.అయితే బుధవారం రోజున ఇంటికి కావలసిన నిత్యావసర సరుకుల కోసం బయటికి వచ్చాడు.

ఇందులో భాగంగా సరుకులు తీసుకుని ఇంటికి వస్తున్న సమయంలో అనుకోకుండా చాతిలో నొప్పి వచ్చింది.దీంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు.

Advertisement
Men Dead For The Attack In Karimnagar, Karimnagar News, Karimnagar Latest News,k

అక్కడ ఉన్న స్థానికులు ఇదంతా గమనిస్తున్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా వెంకటేష్ కి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

Men Dead For The Attack In Karimnagar, Karimnagar News, Karimnagar Latest News,k

ఎక్కడ వెంకటేష్ కి సహాయం చేస్తే కరోనా వైరస్ సోకుతుందేమోనని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడ్డారు.దీంతో సహాయం అందక వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందాడు.దీంతో ఇవాళ ఓ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది.

ఏదేమైనా కరోనా వైరస్ వల్ల తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడంలో టువంటి సందేహం లేదు.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు