ఫ్రెండ్ చెల్లిపై కన్నేసిన మరో స్నేహితుడు.. చివరికి...

ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ, పెళ్లి వ్యామోహం వంటి వాటి మోజులో పడి తమ అనుకున్న వాళ్ళని కడతేర్చటానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.

కాగా తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడి చెల్లెలిపై మోజు పడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ తన స్నేహితుడు మరియు అతడి తల్లి అడ్డుపడుతున్నారని ఏకంగా స్నేహితుడిని దారుణంగా హత మార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విజయ నగరం జిల్లా పరిసర ప్రాంతంలో పవన్ కుమార్ అనే 17 సంవత్సరాలు కలిగిన యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.కాగా పవన్ కుమార్ కి 16 సంవత్సరాలు కలిగిన సోదరి ఉండగా ఈమె ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.

అయితే స్థానికంగా ఉంటున్న సురేష్ అనే వ్యక్తి పవన్ చెల్లెలిపై కన్నేశాడు.ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకోవాలనే నెపంతో పవన్ తో స్నేహం పెంచుకుని అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తూ మంచి వాడిలా నటించేవాడు.

ఈ క్రమంలో ఇటీవలే సురేష్ పవన్ కుమార్ తో తన చెల్లెలిని తనకిచ్చి పెళ్లి చేయాలని అడిగాడు.దీంతో పవన్ కుమార్ తో పాటు తన తల్లి కూడా ఈ పెళ్లిని అంగీకరించలేదు.

Advertisement

దీంతో పవన్ కుమార్ పై సురేష్ కక్ష పెంచుకున్నాడు.ఈ క్రమంలో పవన్ కుమార్ తల్లి కి జగదీష్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నాడు.

దీంతో వెంటనే జగదీష్ అనే వ్యక్తిని కలుసుకుని పవన్ అడ్డును తొలగించుకుంటే తామిద్దరూ తల్లి కూతుర్లతో ఎంజాయ్ చేయొచ్చని లేనిపోని మాటలు కల్పించి పవన్ కుమార్ ని హత్య చేసేందుకు ఉసిగొల్పాడు.ఈ క్రమంలో పవన్ కుమార్ ని మాట్లాడాలని పిలిపించి దారుణంగా హతమార్చి ఊరి బయట ఉన్న బావిలో శవాన్ని పడేసారు.అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.

కాగా దారిన గుండా వెళ్తున్న స్థానికులు మృతదేహం వాసన రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో భాగంగా సురేష్ మరియు జగదీష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు