కుర్ర హీరోలకు ధీటుగా, చిరంజీవి జిమ్ లో కసరత్తులు..

మెగా స్టార్ చిరంజీవి జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషి.

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్త్రిలో ఒక్కోమెట్టు ఎక్కుతూ తెలుగు ప్రజల అభిమానం మరియు అభిమానులను సంపాదించుకుని మెగా స్టార్ గా ఎదిగాడు.

అతని అభిమానుల గుండెల్లో మాత్రం అన్నయ్య గా చెరగని ముద్ర వేసుకున్నాడు.ఇప్పుడున్న యువ హీరోలతో పోటి పడి మరీ సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా అయన నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయి లాగా నిలిచిపోతుంది.

బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను చిరంజీవి తిరగరాశాడు.

Advertisement

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించాడు.ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రం కోసం మెగా స్టార్ జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నాడు.

అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది.చిరంజీవి అభిమానులు మాత్రం.

అన్నయ్య మీరు ఇప్పటి హీరోలకు మరియు మాలాంటి అభిమానులకు ఆదర్శం, అలాగే మీ డెడికేషన్, పని పైన ఉన్న శ్రద్ద మాలాంటి యువతకు ఆదర్శం అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పొగడత్తలతో ముంచెత్తుతున్నారు.ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ నుండి ఓ సామజిక కార్యకర్తగా ఓ ముప్పై ఏండ్ల కుర్రాడిలాగ చిరంజీవి కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Advertisement

తాజా వార్తలు