భోళా శంకర్‌ ప్రీ రిలీజ్ టాక్‌.. మెగా ఫ్యాన్స్ కి రిలాక్స్‌

మెగా స్టార్ చిరంజీవి, మెహర్‌ రమేష్( Meher Ramesh ) కాంబినేషన్‌ లో రూపొందిన భోళా శంకర్‌ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున బుకింగ్‌ చేసుకోవడం జరిగింది.అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్( Bhola Shankar Pre release Event ) హడావుడి నేపథ్యం లో మెగా ఫ్యాన్స్ లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

హీరోయిన్‌ తమన్నా నటిస్తున్నా కూడా ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.అంతే కాకుండా ఆమె నటించిన పాటల్లో కూడా ఆమె పెద్దగా సందడి చేసిన దాఖలాలు లేవు అంటూ విమర్శలు వచ్చాయి.

ఇక ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా సందడి చేయడం లేదు.దాంతో సెన్సార్‌ బోర్డ్‌ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో అంటూ కొందరు కామెంట్స్‌ చేయడం జరిగింది.మొత్తానికి భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) విషయంలో కొందరు చేస్తున్న హడావుడికి అంత సీన్ లేదు అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.

Advertisement

ట్రైలర్‌ రిలీజ్ అయిన తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కనుక ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా నమ్మకంగా ఉన్నారు.

అంతే కాకుండా భోళా శంకర్ సినిమా లో చిరంజీవి( Chiranjeevi ) పాత్ర గతంలో ఆయన నటించిన సూపర్ హిట్‌ సినిమాల పాత్రలకు కాస్త టచ్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూళ్లు కూడా నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమా లో జబర్దస్త్‌ కి చెందిన చాలా మంది ఉన్నారు.

ముఖ్యంగా ఆది కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు