Meena : చివరి రోజు, చివరి శ్వాస వరకు నా భర్త తోనే ఉన్నాను : హీరోయిన్ మీనా

నటి మీనా( Meena )ఎవరికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.

హీరోయిన్ గా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో అగ్రస్థానంలో కొన్నేళ్ల పాటు ఏకచత్రాధిపత్యం చేసింది మీనా.

సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకొని పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత సైతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి సక్సెస్ఫుల్ గా తన కెరీర్ ను ప్రస్తుతం కొనసాగిస్తోంది.చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన ప్రయాణం అన్ని దశల్లోనూ అద్భుతంగా కొనసాగింది.

ప్రస్తుతం మీనా భర్తను కోల్పోయి ఇద్దరు ఆడపిల్లలతో తన తల్లితో కలిసి ఉంటుంది.తమిళనాడులోనే ఆమె ఎక్కువగా నివసిస్తూ అవకాశాలను బట్టి హైదరాబాద్ కి కూడా వచ్చి వెళుతుంది.

Meena About Her Husband Health Problems

మీన భర్త విద్యాసాగర్( Vidyasagar ) సాఫ్ట్వేర్ నిపుణులు కాగా ఆ మధ్య కాలంలో లంగ్స్ పూర్తిగా పాడవడంతో కొన్ని రోజుల పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని దానికి సొల్యూషన్ దొరకక పోవడంతో ఆయన కన్నుమూశారు.నిజానికి లంగ్స్ మార్చాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అతడికి డొనేట్ చేయడానికి లంగ్స్ ఎవరివి సరిపోకపోవడంతో చాలా రోజుల పాటు ఆశగా ఎదురుచూసి చూసి చివరికి ఆ ప్రయత్నాలన్నీ విఫలమై ఆయన కన్ను మూయడం మీనా జీవితంలో కోలుకోలేని షాకుని ఇచ్చింది.కొన్నిసార్లు డొనేట్ చేయడానికి కొంత మంది ముందుకు వచ్చినా కూడా అవి ఆయన బాడీకి సరిపోకపోవడంతో ఆ దిశగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి.

Meena About Her Husband Health Problems
Advertisement
Meena About Her Husband Health Problems-Meena : చివరి రోజు, �

చాలామంది మీనా భర్తతో విడిగా ఉండడం వల్లే ఆయన ఒంటరిగా ఉంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు అంటూ చెబుతారు.కానీ వాస్తవంలో పరిస్థితి మరోలా ఉంది.తన భర్తను కాపాడుకోవడానికి దేశ విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించారట మీనా.

చివరి రోజు వరకు భర్తతోనే ఉన్నారట.కానీ ఎంత ప్రయత్నించినా ఆయనకు సరైన లంగ్స్ దొరకలేదని అందువల్లే ఆయనను కోల్పోవాల్సి వచ్చిందని ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఎంతో ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉందని ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ గా ఈ విషయాలను తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు