రిపబ్లికన్ పార్టీ మహిళా నేత, యూఎస్ కాంగ్రెస్‌వుమెన్ లారెన్ బోబెర్డ్( Lauren Boebert ) 2024 ఎన్నికల్లో స్థానం మారుతున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం కొలరాడోలోని( Colorado ) 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న లారెన్ .
వచ్చే ఏడాది మాత్రం 4వ జిల్లా నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.ఈ మేరకు బుధవారం ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.2025లో 4వ జిల్లాలో ప్రాతినిథ్యం వహించడానికి , అట్టడుగు స్థాయి సంప్రదాయవాద ఓటర్ల నమ్మకాన్ని సంపాదించడానికి పనిచేస్తానని ఆమె చెప్పారు.ఇది వ్యక్తిగతంగా తనకు సరైన చర్య అని , సంప్రదాయవాద ఉద్యమానికి మద్ధతు ఇచ్చేవారికి సరైన నిర్ణయమని లారెన్ పేర్కొన్నారు.
బోబెర్డ్ 2022లో కొలరాడో 3వ డిస్ట్రిక్ట్ ఎన్నికల్లో తన సమీప డెమొక్రాటిక్ ప్రతినిధి ఆడమ్ ఫ్రిష్‌ను( Adam Frisch ) 546 ఓట్ల తేడాతో ఓడించింది.తాజా ఎన్నికలకు సంబంధించి ఫ్రిష్ గత త్రైమాసికంలో నిధుల సమీకరణలో బోబెర్డ్ కంటే మూడు సార్లకు పైగా మెరుగైన పనితీరు కనబరిచారు.కొలరాడో సన్ నివేదించిన దాని ప్రకారం.కొలరాడో శాసనసభ సిబ్బంది గత ఎన్నిల ఫలితాల విశ్లేషణ ఆధారంగా 4వ జిల్లా కంటే 9 పాయింట్ల ఎడ్జ్‌తో 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్( 3rd Congressional District ) రిపబ్లికన్‌లకు పోటీ ఎదురయ్యే అవకాశం వుందని తెలిపింది.
ఇదే సమయంలో 4వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ మాత్రం రిపబ్లికన్‌లకు 27 పాయింట్ల అడ్వాంటేజ్‌ను చూపుతోందని నివేదిక పేర్కొంది.
నియోజకవర్గం మార్పుపై ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు బోబెర్డ్.తాను ఈ నిర్ణయానికి అంత తేలిగ్గా రాలేదన్నారు.ఎన్నో ప్రార్ధనలు, కఠినమైన సంభాషణలు, సంప్రదాయ ఉద్యమం కోసం , నా పిల్లల భవిష్యత్తు కోసం పోరాడేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని నన్ను ఒప్పించిందని లారెన్ బోబెర్డ్ తెలిపారు.2023 నాకు, నా కుటుంబానికి కష్టతరమైన సంవత్సరంగా ఆమె అభివర్ణించారు.ఈ ఏడాది మేలో బోబెర్డ్ తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
అలాగే సెప్టెంబర్‌లో బీటిల్‌జూయిస్ థిమేటర్ వివాదం మరో కీలక ఘటనగా నిలిచింది.వ్యక్తిగతంగా కొన్ని తప్పులు చేశానని.
వాటికి క్షమాపణలు కోరుతున్నానని, తల్లిగా, కాంగ్రెస్ వుమెన్‌గా నా విశ్వాసాన్ని, బలాన్ని , సామర్ధ్యాలను ఇది పరీక్షించిందని బోబెర్డ్ చెప్పారు.కొలరాడో మూడవ డిస్ట్రిక్ట్‌లో అమెరికా అంతటా తనతో పాటు స్థిరంగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.