Sunflower : పొద్దు తిరుగుడు పంటను పక్షుల బెడద నుంచి సంరక్షించే చర్యలు..!

ప్రధాన నూనె గింజల పంటలలో పొద్దు తిరుగుడు పంట( Sunflower cultivation ) కూడా ఒకటి.

పైగా ప్రస్తుత కాలంలో పొద్దు తిరుగుడు నూనె వినియోగం పెరుగుతూ ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

పొద్దు తిరుగుడు పంటలో అధిక దిగుబడులు సాధించడం కోసం, వివిధ రకాల పక్షుల నుండి పంటను ఎలా సంరక్షించుకోవాలి.పొద్దు తిరుగుడు పంటలో సరైన యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

పొద్దు తిరుగుడు పంట సాగుకు దాదాపుగా అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి.వేసవికాలంలో నేలను రెండుసార్లు లోతు దుక్కులు దున్నుకొని, ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు వేసి పొలాన్ని కలియదున్నాలి.ఒక ఎకరాకు 2.5 కిలోల విత్తనాలు అవసరం.ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల థైరంతో ( thyrum )విత్తన శుద్ధి చేసుకోవాలి.

మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి, మొక్కలు ఆరోగ్యకరంగా పెరగాలంటే.మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

Advertisement

నాణ్యమైన పంట దిగుబడి పొందాలంటే.పొద్దు తిరుగుడు పంట పుష్పించే సమయంలో హానికరమైన రసాయన పిచ్చికారి మందులు ఉపయోగించకూడదు.ఉదయం సున్నితమైన మెత్తని వస్త్రంతో పువ్వును రుద్దాలి.

వారం రోజులకు ఒకసారి ఇలా రుద్దడం వల్ల ఫలదీకరణం సక్రమంగా జరిగి గింజ నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది.

పొద్దు తిరుగుడు పంటకు పక్షుల బెడద( Birds of prey ) చాలా అంటే చాలా ఎక్కువ.ఉదయం, సాయంత్రం సమయంలో పొలంలో పెద్ద పెద్ద శబ్దాలు చేయాలి.రెండు లీటర్ల నీటికి ఒక గుడ్డు నీలాన్ని కలుపుకొని, పొద్దు తిరుగుడు పువ్వు పై పిచికారి చేయాలి.

వారం రోజులకు ఒకసారి పిచికారీ చేస్తే పక్షులు పంటకు హాని కలిగించే అవకాశం ఉండదు.పొలం చుట్టూ అక్కడక్కడ మెరుపుతీగలు ఏర్పాటు చేయాలి.పంట నాణ్యత బాగుండాలంటే పుష్పించే దశ నుండి గింజ గట్టిపడే వరకు నేలలో తేమశాతం తగ్గకుండా నీటి తడులు అందించాలి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!

కనీసం 10 రోజులకు ఒకసారి నీటి తడిని అందించాలి.

Advertisement

తాజా వార్తలు