కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఎనిమిది పేజీల లేఖ రాశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్న ఆయన చాలా బాధతో కాంగ్రెస్ తో బంధం తెంచుకుంటున్నట్లు తెలిపారు.

ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదన్నారు.అనంతరం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తన వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకున్నారని శశిధర్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర విభజన సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు.

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారనే వార్తలు వచ్చాయని వెల్లడించారు.దాంతోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులు పీసీసీ ఏజెంట్లుగా పని చేశారని, హైకమాండ్ కు అనుకూలంగా కాకుండా పీసీసీలకు దాసోహం అయ్యారని విమర్శించారు.కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఇదే దుస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు.

హైకమాండ్ ఇంఛార్జులకు పీసీసీలు బంగారు బాతులుగా మారాయన్నారు.ఈ ధన ప్రభావం కేసీ వేణుగోపాల్ వరకు పాకిందని ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు