తల్లికి రెండో పెళ్లి చేసిన ప్రముఖ నటుడు.. ఐ లవ్ యూ అమ్మ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతూ?

కొడుకుకు రెండో పెళ్లి చేసిన తల్లి గురించి చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం.

అయితే ఒక ప్రముఖ నటుడు మాత్రం తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా మరాఠీ సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సిద్దార్థ్ చందేకర్( Siddharth Chandekar ) తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.తాజాగా ఈ నటుడు నటించిన సిటీ ఆఫ్ డ్రీమ్స్( City Of Dreams ) అనే వెబ్ సిరీస్ విడుదలైంది.

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సిద్దార్థ్ తన తల్లికి రెండో పెళ్లి చేయగా అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిద్దార్థ్ చందేకర్ తల్లి రెండో పెళ్లికి( Siddharth Chandekar Mother ) సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.తన తల్లి పెళ్లి గురించి సిద్దార్థ్ స్పందిస్తూ అమ్మా.

Advertisement

హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకొచ్చారు.నీ బిడ్డలతో పాటు నీ లైఫ్ కూడా ఇంకా ఉంది అంటూ సిద్దార్థ్ కామెంట్ చేశారు.

నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉందని ఇప్పటివరకు మాకోసం చాలావరకు త్యాగం చేశావని అన్నారు.ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.ఈ విషయంలో పిల్లలు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని సిద్దార్థ్ కామెంట్లు చేశారు.

మీరు నా పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేశారని ఇప్పుడు నేను అదే పని చేస్తున్నానని సిద్దార్థ్ అన్నారు.

తన తల్లి రెండో పెళ్లి నేను అత్యంత ఎక్కువగా ఆనందపడే పెళ్లి అని సిద్దార్థ్ పేర్కొన్నారు.ఐ లవ్ యూ అమ్మా.హ్యాపీ మ్యరీడ్ లైఫ్ అంటూ సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

సిద్దార్థ్ చందేకర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు