మనో.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నే గుర్తు పట్టలేదట..

మనో.తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన తెలియని వారు ఉండరు.

పాటలతో పాటు మాటలతోనూ జనాలను మంత్ర ముగ్ధుల్ని చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా భిన్న పాత్రలు పోషిస్తున్నాడు మనో.

తాజాగా ఆయన అలీతో సరదాగా అనే షోలో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఏకంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కాల్ చేసినా తాను గుర్తు పట్టలేదని చెప్పాడు.ఇంతకీ ఆయన ఎందుకు కాల్ చేశాడు? ఈయన ఎందుగు గుర్తు పట్టలేదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముత్తు సినిమా నిర్మాతల మూలంగా తను రజనీకాంత్ కు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినట్లు మనో వెల్లడించాడు.

Advertisement

సాయి కుమార్ కన్నడ సినిమాల్లో బిజీగా ఉండటంతో.ఈ అవకాశం వచ్చినట్లు చెప్పాడు.

బాషా సినిమా వరకు సాయి కుమారే రజనీకి డబ్బింగ్ చెప్పినట్లు వెల్లడించాడు.ముత్తు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా.

సాయి కుమార్ అందుబాటులో లేడు.దీంతో వేరే డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం ప్రయత్నించారు.

ఈ సినిమా రచయిత శ్రీరామకృష్ణ ఫోన్‌ చేసి క్లైమాక్స్‌ డబ్బింగ్‌ చెప్పాలని కోరాడు.రజనీకాంత్ కు నచ్చితే ఓకే చేస్తామని చెప్పారు.సరే అని చెప్పాను.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తన వాయిస్ ఆయనకు బాగా నచ్చడంతో కంటిన్యూ చేయాలన్నాడు.ఎంతో సంతోషం అనిపించిందన్నాడు మనో.

Advertisement

అటు చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యాక రాత్రి గంటల సమయంలో మనోకు ఓ ఫోన్ వచ్చింది.నేను రజనీకాంత్ ను మాట్లాడుతున్నా అన్నాడు.తనకు తెలిసిన మిత్రులు ఎవరైనా మిమిక్రీ చేస్తున్నారేమో అనుకున్నాడు.

ఏ రజనీకాంత్ అని అడిగాడు.ఆ తర్వాత తను అసలు రజనీకాంతే అని గుర్తుపట్టాడు.

వెంటనే సారీ చెప్పాడు.చంద్రముఖి తెలుగు వెర్షన్‌ చూశాను.

డబ్బింగ్ చాలా బాగుంది అన్నాడు.ఆయన స్టైల్లో మనోను అభినందించాడు.

ఏం కావోలో అడుగు అని చెప్పాడు.బిర్యానీ చేసి పంపిస్తాను తినండి సర్ అని చెప్పాడు.

అప్పటి నుంచి రజనీకాంత్ తో తనకు అనుబంధం బాగాపెరిగిందని చెప్పాడు మనో.

తాజా వార్తలు