Actor Manikandan: మలేషియా అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బాయ్స్ సినిమా నటుడు

2002 లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా గుర్తుందా ? ఈ సినిమాలో నలుగురు యువకుల జీవితాలతో విధి ఎలా ఆదుకుందో అనే విషయాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు.

చదువు మరియు కెరీర్ గొప్పతనం కూడా చక్కగా వివరించాడు.

ఇక ఆ నలుగురు యువకుల పాత్రల్లో సిద్ధార్థ్, నకుల్, థమన్, మణికందన్ నటించారు.ఈ నలుగురిలో మొదటి ముగ్గురు హీరోలు బాగానే సెటిల్ అయినా మణికందన్ మాత్రం అడ్డ్రస్ లేకుండా పోయాడు.

సినిమాలు ఎంచుకోవడం లో తడబడటం తో అతడి కెరీర్ ముందుకు సాగలేదు.ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న మణికందన్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

ఒక తమిళ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మణికందన్ తన కెరీర్ ఫెయిల్యూర్ అవ్వడం లో గా కారణాలని వివరిస్తూ తాను వ్యక్తి గత జీవితంలో ఎదుర్కొన్న అనేక విషయాలు సైతం వివరించాడు.ప్రస్తుతం 39 ఏళ్ళ వయసున్న మణికందన్ కొన్నేళ్ల క్రితం కెరీర్ కి గుడ్ బై చెప్పి మరి ఒక అమ్మాయి తో పేస్ బుక్ లో పరిచయం అయినా మలేషియన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

Advertisement
Manikandan Love Failure With Malaysia Girl Details, Manikandan, Actor Manikandan

ఆ అమ్మాయి తో ప్రేమాయణం సాగించడం వరకు ఒకే కానీ ఆ అమ్మాయి కోసం ఏకంగా తన తల్లి దగ్గర డబ్బు తీసుకొని ఏకంగా మలేషియా కి వెళ్ళిపోయాడట.కలవక ముందు ఘాడమైన అతడి ప్రేమ కథ మలేషియా వెళ్ళాక మరోలా అయ్యిండదట.

Manikandan Love Failure With Malaysia Girl Details, Manikandan, Actor Manikandan

అక్కడికి వెళ్ళాక కేవలం రెండ్రోజుల్లోనే ఆ అమ్మాయి తీరు నచ్చలేదట.రోజంతా తాగుతూ, షాపింగ్ పేరుతో అతడి డబ్బంతా ఖర్చు చేసిందట.ఇక చీటికి మాటికి గొడవలు కూడా పడుతుండటం తో ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బు మిగలదేమో అని భయంతో చెప్పపెట్టకుండా పారిపోయి వచ్చాడట.

ఇలా మలేషియా అమ్మాయి కోసం కేవలం ప్రేమ కోసం అయితే వెళ్ళలేదు అని సెక్స్ పైన ఇంట్రెస్ట్ తోనే కానీ ఆ అమ్మాయి లైఫ్ లో పెద్ద గుణపాఠం నేర్పింది అంటూ చెప్పుకోచ్చాడు మణికందన్.ఏది ఏమైనా దూరపు కొండలు నునుపు అని ఊరికే చెప్పలేదు కదా.ఇలాంటి ఏక్సపీరియెన్స్ తో పెళ్లి కూడా చేసుకోకుండా సింగల్ గానే మిగిలిపోయాడు మణికందన్..

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు