జిన్నా సినిమా పై ఒకింత పాజిటివ్‌ టాక్‌... మంచు విష్ణుకి దక్కేనా?

మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా సినిమా రేపు ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే.గతంలో మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు విష్ణు తీవ్రంగా నిరాశ పరిచాడు.

50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా కనీసం ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కూడా నమోదు చేయలేక పోయింది అంటూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు.కోటి రూపాయల షేర్ కలెక్షన్స్ నమోదు చేయని మంచు హీరో సినిమా అంటూ మోసగాళ్లు సినిమాను ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు.

జనాలు మంచు హీరోల గురించి పట్టించుకోవడం లేదని వారు ఏ సినిమాలు చేసినా కూడా జనాలు ఆదరించే పరిస్థితి కనపడడం లేదు అంటూ చర్చ జరుగుతున్న సమయంలో జిన్నా సినిమా అందరి ఆలోచనలను మార్చేస్తుంది అంటున్నారు.

రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా షురూ అయ్యాయి.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో విష్ణు కాస్త తక్కువగానే మాట్లాడుతూ, సినిమా గురించి ఎక్కువగా ఫోకస్ అయ్యేలా చేస్తున్నాడు.గతంలో మాదిరిగా ఆహా ఓహో అన్నట్లుగా మాట్లాడకుండా ఉన్నంతలో మాట్లాడుతూ హీరో విష్ణు సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు.

Advertisement

అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కనుక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఈ సమయంలో సినిమా గురించి చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచు విష్ణు సినిమాకు ఇంతలా పాజిటివ్ రావడంతో ఈసారి మంచు విష్ణు సినిమా సక్సెస్ కొట్టడం ఖాయం అన్నట్లుగా కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయితే మంచు విష్ణు మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలను చేస్తాడని తీస్తాడని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా అయినా ఆయనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెట్టేనా చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు