అంబానీ వేడుకలలో భార్యతో కలిసి సందడి చేసిన మంచు మనోజ్... ఫోటోలు వైరల్?

మంచు మనోజ్( Manchu Manoj ) ఇటీవల కాలంలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

ఈయన మొదటి వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోజ్ ఈ ఏడాది మొదట్లో భూమ మౌనిక రెడ్డి( Bhuma Mounika Reddy ) ని రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరి వివాహ వేడుక ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది అయితే ఇద్దరికీ కూడా రెండవ వివాహం కావడం విశేషం.ఇలా రెండో పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ ఒకవైపు వృత్తిపరమైన జీవితంలోనూ మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

మనోజ్ ప్రస్తుతం ఒక షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా తన సినిమా పనులను కూడా ప్రారంభించారని తెలుస్తోంది.అలాగే తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట ముఖేష్ అంబానీ నిర్వహించినటువంటి వేడుకలలో పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ముంబయిలో అత్యంత లగ్జరీ మాస్‌ జీయో వరల్డ్ ప్లాజా( Jio World Plaza )ని బుధవారం ప్రారంభించారు.

ఇది లగ్జరీ షాపింగ్‌ మాల్‌.సెలబ్రిటీలకు అడ్డా అయినా బాంద్రాలో దీన్ని ప్రారంభించారు.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇలా పలువురు హీరోయిన్స్ ఈ కార్యక్రమంలో సందడి చేయగా హీరోలకు మాత్రం పెద్దగా ఆహ్వానం అందలేదని తెలుస్తుంది.కానీ మంచు మనోజ్ కి మాత్రమే ఆహ్వానం రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇక ఈ వేడుకలలో మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి సందడి చేశారు.

అలాగే ఈ దంపతులు ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) తో కలిసి కాసేపు ముచ్చటించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనోజ్ అందరి దృష్టిలో పడ్డారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు