పెళ్లి తర్వాత భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన మంచు మనోజ్.. ఫొటోస్ వైరల్?

మంచు మనోజ్,భూమా మౌనిక రెడ్డిల వివాహం తాజాగా శుక్రవారం రోజు మంచు లక్ష్మి నివాసంలో జరిగిన విషయం తెలిసిందే.శుక్రవారం రాత్రి 8:30కు మూడుముళ్ల బంధంతో వేదమంత్రాల సాక్షిగా వీరిద్దరూ ఒకటయ్యారు.

ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ నివాసం వద్ద వీరి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

మంచు మనోజ్ మౌనిక రెడ్డిల వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు సన్నిహితులు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరైన విషయం తెలిసిందే.

Manchu Manoj And His Wife Mounika Reddy After Marraige Pics Details, Manchu Mano

ప్రస్తుతం ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి.అంతేకాకుండా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంచు అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటుగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇకపోతే గత కొంతకాలంగా వీరి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తను సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.

వార్తలపై మంచు మనోజ్ కానీ భూమా మౌనిక కానీ స్పందించలేదు.ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

Manchu Manoj And His Wife Mounika Reddy After Marraige Pics Details, Manchu Mano
Advertisement
Manchu Manoj And His Wife Mounika Reddy After Marraige Pics Details, Manchu Mano

మొదట స్నేహంతో మొదలైన మనోజ్, మౌనికల ప్రయాణం ఆ తర్వాత ప్రేమగా మారి భార్య భర్తలు గా ఒకటయ్యారు.మంచు మనోజ్ అక్క అయినా మంచు లక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకోవడంతో పాటు పెళ్లి పెద్దగా ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఆ మంచు మనోజ్ మౌనిక ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో మౌనిక కొడుకు ధైరవ్‌ రెడ్డి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు.మనోజ్‌ మౌనికలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడంతో క్యూట్ కపుల్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు