టీచర్ అవతారంలో పాఠాలు చెప్పిన మంచు లక్ష్మి

టాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి మంచు లక్ష్మి.

మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనదైన శైలీలో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకుంది.

సరైన పాత్ర పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ముందుండే మంచ్ లక్ష్మి అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది.ఓ వైపు నటిగా చేస్తూనే నేనుసైతం అనే సోషల్ సర్వీస్ రియాలిటీ షో ద్వారా సెలబ్రిటీలతో ఎంతో మందికి సహాయం చేయించిన మంచు లక్ష్మిని సామాజిక దృక్పథం ఉన్న మహిళగా కూడా సమాజంలో గుర్తింపు ఉంది.

సామాజిక సేవా కార్యక్రమాలకి ముందుండే మంచు లక్ష్మి తాజాగా టీచర్ అవతారం ఎత్తి పిల్లలకి పాఠాలు చెప్పింది.ప్రపంచంలో సుప్రసిద్ధ సంస్థలకు వినియోగదారులతో అనుసంధానించబడేందుకు సాధికారిత కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ పెగా సిస్టమ్స్, ఐఎన్సీ ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష విద్యలో శిక్షణ అందించడంతో పాటుగా నాయకత్వ లక్షణాలు డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణా అందిస్తుంది.

టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్చంద సంస్థ మంచు లక్ష్మిని ఒక రోజు ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలిగా సేవలనందించేందుకు ఆహ్వానించింది.వారి ఆహ్వానం మేరకు మాదాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించడంతో పాటుగా నూతన విద్యా సంవత్సరంలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ అక్షరాస్యత కార్యక్రమం కోసం వాలెంటీర్ అప్లికేషన్ లను ఆహ్వానించారు.

Advertisement

ఆ సంస్థ ఆహ్వానం మేరకు మంచు లక్ష్మి పాఠాశాలకి వెళ్లి ఆంగ్ల భాషను బోధించింది.దీనికి సంబందించిన ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు