అమెరికాలో మన తెలుగు రాష్ట్రం యువకుడు మృతి..

మన దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి ఉపాధి కోసం సౌదీ అరేబియా, అమెరికా వంటి దేశాలకు వెళ్లి కొన్ని రకాల ఉద్యోగాలను లేదంటే ఏవైనా చిన్న చిన్న పనులను చేసుకుంటూ నివసిస్తున్న వారు చాలామంది ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే చాలా దేశాలలో మన దేశానికి చెందిన ప్రజలు కానీ, మన దేశ సంతతికి చెందినవారు కానీ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు.

అలా వెళ్లిన వారిలో అమెరికాకు కూడా చాలామంది వెళ్లారు.తాజాగా అమెరికాలో 2022వ సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల రెడ్డి కాలనీకి చెందిన పెండ్యాల సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ మృతి చెందాడు.10 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన ఇతను ఆరి జునా స్టేట్ లోని ఫోనిక్ సిటీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉండేవాడు.2022 డిసెంబర్ 31వ తేదీన రాత్రి స్నేహితులతో కొత్త సంవత్సర వేడుకలలో పాల్గొని రూమ్ కి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.

అమెరికాలోనే ఉంటున్న మృతుడి సోదరీ పద్మ దంపతులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వంశీకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న మంచు అధికంగా ఉండడం వల్ల విమానాలు తగిన సంఖ్యలో నడవడం లేదని తెలుస్తోంది.మృతదేహం మంచిర్యాల చేరెందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అమెరికా మీడియా వెల్లడించింది.

అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు