మరిన్ని పేద కుటుంబాలకు సాయం చేసిన కాదంబరి కిరణ్.. మనుషుల్లో దేవుడంటూ?

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోల, హీరోయిన్ల ఆస్తులు వందల, వేల కోట్ల రూపాయలు కాగా ఆ మొత్తంలో కోటి రూపాయలు సహాయం చేయడానికి సైతం మనసొప్పని సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు.

అయితే కాదంబరి కిరణ్( Kadambari Kiran ) మాత్రం మనం సైతం ఫౌండేషన్( Manam Saitham Foundation ) ద్వారా ఇతర సెలబ్రిటీల సహాయసహకారాలతో తన వంతు సహాయం అందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

కాదంబరి కిరణ్ మనుషుల్లో దేవుడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు కాదంబరి కిరణ్ వరుసగా సహాయాలు చేస్తున్నారు.

ఈమని శ్రీనివాస్ అనే సౌండ్ ఇంజనీర్ కిడ్నీ సమస్యతో బాధ పడుతుండగా కిడ్నీ మార్పిడి కోసం కాదంబరి కిరణ్ 25 వేల రూపాయల సహాయం చేశారు.సినిమా రచయిత భరత్ కుమార్( Writer Bharat Kumar ) కుటుంబానికి సైతం కాదంబరి కిరణ్ పాతిక వేల రూపాయల సహాయం అందించడం గమనార్హం.

ఇలా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కాదంబరి కిరణ్ అండగా నిలబడుతున్నారు.

Advertisement

25,000 రూపాయలు అంటే మరీ ఎక్కువ మొత్తం కాదు.అలా అని తక్కువ మొత్తం కూడా కాదు.కష్టాల్లో ఉన్నవాళ్లకు ఈ మొత్తం కనీసం నెలరోజుల కష్టాలను అయినా తగ్గిస్తుందని చెప్పవచ్చు.

ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లకు ప్రధానంగా మనం సైతం ఫౌండేషన్ సహాయం అందిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఫౌండేషన్ సేవలను తెగ మెచ్చుకుంటున్నారు.

కాదంబరి కిరణ్ నటుడిగా కెరీర్ పరంగా బిజీ అయితే ఆయన రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.కాదంబరి కిరణ్ యాక్టింగ్ స్కిల్స్, కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆయన ఎంతోమంది ప్రశంసలను అందుకుంటున్నారు.

కాదంబరి కిరణ్ వివాదాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు