బాబోయ్: నోట్లో సూదులతో బ్రతుకుతున్న వ్యక్తి...35 సంవత్సరాలుగా...

నోట్లో సూదులతో వ్యక్తి బ్రతకడం ఏంటి అని అనుకుంటున్నారా.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజంగా మంచిర్యాల జిల్లా కు చెందిన శ్రీను అనే వ్యక్తి కి అక్కడ సూదుల శ్రీను అని పేరు.

అయితే అతడు వృత్తి రీత్యా ట్రైలర్ అయినప్పటికీ ఆయనకు ఆ పేరు రావడానికి మాత్రం ఆయన వృత్తి ఏమాత్రం కారణం కాదు.అసలు విషయం ఏంటంటే శ్రీను తన నోట్లో ఎవరికీ కూడా కనిపించకుండా 50 కి పైగా సూదులను ఉంచుకోగలడట.

చిన్నప్పటి నుంచి నోట్లో సూదులను పెట్టుకోవడానికి అలవాటు పడిన శ్రీను ఇప్పుడు దాదాపు 50 సూదులకు పైగానే తన నోట్లో ఉంచుకుంటున్నాడు.గత 35 సంవత్సరాలుగా అతడికి అది అలవాటు అయిపోయిందట.

శ్రీను తల్లిదండ్రులు కూడా టైలరింగ్ వృత్తి లోనే ఉండడం తో ఇంటిలోనే చాలా సూదులు అందుబాటులో ఉండేవి.అయితే అతడు నాలుగో తరగతి చదువుతున్న సమయం నుంచే నోట్లో సూదులను పెట్టుకోవడం అలవాటు చేసుకున్న అతడు ఇక నిదానంగా ఆ సంఖ్య ను పెంచుకుంటూ నోట్లో సూదులను పెట్టుకోవడం మొదలు పెట్టాడు.

Advertisement

ఒకటి, రెండు, మూడు ఇలా చివరకు యాభై నుంచి వంద సూదులను నోట్లో ఉంచుకోవడం అలవాటుగా మారింది.సూదులు నోట్లో లేకుండా ఉండలేని అలవాటుగా మారింది.

దాంతోనే తనకు సూదుల శ్రీనుగా నామకరణం జరిగింది.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలంలోని చందారం గ్రామానికి చెందిన ఇప్పళ్లపల్లి శ్రీనివాస్ అక్కడ సూదుల శ్రీను గా మారిపోయాడు.

అయితే మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈయన గారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో సహా భోజనం, తదితర కార్యక్రమాలన్నీ కూడా నోట్లో సూదులుతోనే చేస్తూ ఉంటాడట.ఇది గత 35 ఏళ్లుగా శ్రీను కొనసాగిస్తున్నాడట.

అయితే ఇవన్నీ పొట్ట పోస్తాయా ఏంటి అందుకే పట్టణంలోని కుట్టు మిషన్ రిపేర్ షాపుతో పాటు అమ్మకం కూడా సాగిస్తూ జీవిస్తూ ఉంటాడట.నిజంగా నోట్లో చిన్న సూది పెట్టుకుంటూనే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాం, అలాంటిది ఈ సూదుల శ్రీను ఏకంగా 50,వంద సూదులు నోట్లో ఉంచుకొని అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉంచుకోవడం గమనార్హం.

ఈ రాగి డ్రింక్ తో నీరసానికి చెప్పండి బై బై..!
Advertisement

తాజా వార్తలు