అమిత్ షా, ఈసీ పై సంచలన ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ..!!

బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉంది.

అధికార పార్టీ తృణమూల్ మరియు బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

మరోపక్క జరుగుతున్న సర్వేలలో రెండు పార్టీల మధ్య విజయం దోబూచులాడుతున్నట్లు.ఫలితాలు రావడంతో రెండు పార్టీలకు చెందిన నేతలు వ్యూహాలు మీద వ్యూహాలు వేస్తున్నారు.

ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.ఈ నేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై, అదేవిధంగా ఈసీ పై సంచలన ఆరోపణలు చేశారు.

కేంద్ర బలగాలను రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారు అంటూ మండిపడ్డారు.రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి బయటనుండి వ్యక్తులు వస్తున్నా, ఈక్రమంలో ఈసీకి ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడంలేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Advertisement

ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నుండి రౌడీలను తీసుకువచ్చి ఓటు వేయకుండా చేస్తున్నారని మండిపడ్డారు.దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశానికి గర్వకారణంగా ఉండాల్సిన బలగాలను తమ స్వార్ధ రాజకీయాలకోసం ఉపయోగించుకుంటున్నారు అంటూ బీజేపీ నాయకుల పై మమతా తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు